దీపావళి, ఛత్ పండుగలకు 804 ప్రత్యేక రైళ్లు

దీపావళి, ఛత్ పండుగలకు 804 ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్, వెలుగు: దీపావళి, ఛత్​ పండుగల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.  ప్రయాణికుల సౌకర్యార్థం 804 స్పెషల్ ట్రైన్స్ నడపనుంది. దేశవ్యాప్తంగా 6,560 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ఇండియన్ రైల్వే ప్రకటించింది. ఇందులో భాగంగానే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 804 స్పెషల్ ట్రైన్స్ ను నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు. పండుగ సీజన్​లో నార్త్ స్టేట్స్​కు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ వంటి ప్రాంతాలకు ప్రయాణికులు ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారు. దీంతో ఈ మార్గంలో అధిక సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. కాచిగూడ, గోరఖ్​పూర్, షిరిడి, దానాపూర్, నిజాముద్దీన్, కటక్, అగర్తలా, సంత్రాగచ్చి, మధురై ఎక్స్ రోడ్, నాగర్ కోయిల్, కొల్లం, బెంగళూరు, పన్వేల్, దాదర్ వంటి స్టేషన్ల మీదుగా ఈ రైళ్లు నడవనున్నాయి.