![బెజవాడలో గంజాయి కలకలం.. 808 కిలోల మత్తుపదార్దాలు సీజ్](https://static.v6velugu.com/uploads/2024/10/808-kgs-drugs-seez-in-vijayawada_pEqHxQC8Lg.jpg)
ఆంధ్రప్రదేశ్లో గంజాయి కలకలం రేగింది. విజయవాడలో మత్తు దొంగల మత్తును పోలీసులు వదిలించారు. కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర సోమవారం ( అక్టోబర్ 7) పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో రెండు వాహనాల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. రూ. 1.61 కోట్ల విలువైన 808 కిలోల మత్తు పదార్ధాలను అధికారులు సీజ్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. రెండు నెలల క్రితం విజయవాడలోని పలు పోలీస్ స్టేషన్లలో 15 మంది గంజాయి దొంగలను పట్టుకున్నారు.