సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రజావాణిలో భాగంగా సోమవారం సిద్దిపేట కలెక్టర్ ఆఫీసులో డీఆర్వో నాగరాజమ్మ అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్జీదారులు మళ్లీ మళ్లీ రాకుండా వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
భూ సంబంధిత, డబుల్బెడ్రూం, పింఛన్లు కలిపి మొత్తం 81 దరఖాస్తులు వచ్చాయన్నారు. అనంతరం కోనోకార్సస్ చెట్లను వెంటనే తొలగించాలని మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు డీఆర్వోకు వినతిపత్రం అందించారు.డీఆర్డీఏపీడీ జయదేవ్ ఆర్యా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.