చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా మద్దూరులో మంగళవారం కుక్కల దాడిలో 81 గొర్రెలు చనిపోయాయి. మండల కేంద్రానికి చెందిన నంగి చంద్రయ్య, కొమురయ్యకు చెందిన గొర్రెల మందపై అర్ధరాత్రి వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 81 గొర్రెలు చనిపోయాయి. దీంతో తాము రూ.10 లక్షలు నష్టపోయానని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.
గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆలేటి యాదగిరి మాట్లాడుతూ నష్టపోయిన గొర్రెల కాపరులకు రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట రమేశ్, మల్లేశం, కొమురయ్య, చంద్రయ్య, ఓజయ్య ఉన్నారు.