నస్పూర్, వెలుగు: పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో 81 టూ వీలర్స్‌ను వేలం వేస్తున్నట్లు రామగుండం సీపీ రెమా రాజేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు. చట్టప్రకారం డాక్యుమెంట్లు చూపించి, వాహనాలను తీసుకెళ్లాలని చెప్పామన్నారు.
6 నెలల నుంచి ఈ వాహనాల కోసం ఎవరూ రానందున గుర్తుతెలియని ప్రాపర్టీగా పరిగణించామని, బెల్లంపల్లి సీఏఆర్ హెడ్ క్వార్టర్ లో ఉంచిన వెహికల్స్‌ను ఈనెల 30వ తేదీన ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం వేస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు 87126 56616, 87126 56621ను సంప్రదించాలన్నారు.