నిజామాబాద్ లో అంతుచిక్కని వ్యాధితో 10 వేల కోళ్లు మృతి

నిజామాబాద్ లో అంతుచిక్కని వ్యాధితో 10  వేల కోళ్లు మృతి

బాన్సువాడ రూరల్, వెలుగు :  అంతుచిక్కని వ్యాధితో మంగళవారం 8100 కోళ్లు మృత్యువాతపడ్డాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం క్యాంప్  గ్రామంలోని కోళ్ల ఫారంలో  కళ్ల ఎదుటే కోళ్లు కొట్టుకుంటూ చనిపోతుండటంతో యజమాని బోడ రాంచందర్ కన్నీటి పర్యంతమయ్యాడు.  

వైరస్ సోకడంతోనే  కోళ్లు మృతి చెందుతున్నాయని యజమాని వాపోయాడు.  నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రాంచందర్​ కోరారు.