న్యూఢిల్లీ: వచ్చే 12 నెలల్లో వెహికల్‌ను తీసుకునే ఆలోచనలో మెజార్టీ కన్జూమర్లు ఉన్నారని మొబిలిటీ అవుట్‌లుక్ సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 83 శాతం మంది రెస్పాండెంట్లు వచ్చే ఏడాదిలోపు వెహికల్‌ను తీసుకోవాలనుకుంటున్నామని చెప్పారు. 13 శాతం మంది కొంటే కొనచ్చని, 4 శాతం మంది కొనమనే రెస్పాన్స్‌ను ఇచ్చారు. కార్‌ట్రేడ్ టెక్‌కు చెందిన మొబిలిటీ అవుట్‌లుక్ మొత్తం 2.7 లక్షల మంది కన్జూమర్ల అభిప్రాయాలను సేకరించింది. కొత్త వెహికల్స్‌ను తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని, యూజ్డ్ వెహికల్స్‌పై కూడా ఆసక్తి పెరుగుతోందని ఈ సర్వే పేర్కొంది. 52 శాతం మంది రెస్పాండెంట్ల కొత్తగా కారు తీసుకోవాలనుకుంటున్నారని, 33 శాతం మంది కొత్త స్కూటర్ లేదా మోటర్ సైకిల్ తీసుకోవాలనుకుంటున్నారని వివరించింది. 13 శాతం మంది సెకెండ్ హ్యాండ్ కారును తీసుకుంటామన్నారు. 3 శాతం మంది సెకెండ్ హ్యాండ్ స్కూటర్ లేదా బైక్‌పై ఎక్కువ ఆసక్తి చూపించారు. ఓనర్‌షిప్ పరంగా చూస్తే, 74 శాతం మంది డైరెక్ట్‌గా డీలర్‌షిప్‌ల నుంచి వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారు.