
తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో 2023-–24 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలో 830 బీఆర్క్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
అర్హత: 50 శాతం మార్కులతో 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) లేదా డిప్లొమా(మ్యాథమెటిక్స్)తో పాటు ఎన్‌ఏటీఏ 2023/ జేఈఈ (మెయిన్) పేపర్-2 (బీఆర్క్)లో ఉత్తీర్ణత సాధించాలి. కోర్సు డ్యురేషన్ అయిదేళ్లు ఉంటుంది.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జులై 22 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు రూ.1800, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ రూ.900 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. జులై 23 నుంచి 31 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది.
వెబ్ ఆప్షన్స్: అభ్యర్థులు ఆగస్టు 5, 6 తేదీల్లో వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం కల్పిస్తారు. రెండో విడత ఆగస్టు 13, 14 తేదీల్లో నిర్వహిస్తారు. స్పాట్ అడ్మిషన్స్ మార్గదర్శకాలు ఆగస్టు 16న జారీ చేస్తారు. సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. పూర్తి సమాచారం కోసం www.barchadm.tsche.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.