గోదావరిఖని, వెలుగు: రామగుండం ఎన్టీపీసీ స్టేజ్–1 కింద నిర్మించిన ప్లాంట్‌లో ఉత్పత్తయిన కరెంట్‌లో రాష్ట్రానికే 85 శాతం సప్లై అవుతుందని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్ పాండు తెలి పారు. మంగళవారం ఎన్టీపీసీ మిలినీయం హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రామగుండం లో 1983లో 200 మెగావాట్లతో ప్రారంభమైన విద్యు త్ ప్లాంట్ విస్తరిస్తూ ఇప్పుడు 4,200 మెగావాట్లకు చేరుకున్నదన్నారు. దేశంలోనే అతిపెద్ద 100 మెగా వాట్ల సామర్థ్యం గల ఫ్లోటింగ్ సోలార్ కరెంట్ఉత్పత్తి రామగుండంలో జరుగుతుందన్నారు.
త్వరలోనే మరో 76 మెగావాట్ల ప్లోటింగ్ సోలార్, 56 మెగావాట్లతో ఖాళీ ప్రదేశాల్లో ల్యాండ్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. తెలంగాణ ఎన్టీపీసీ ప్లాంట్‌లో భాగంగా స్టేజ్–2లో 2,400 మెగావాట్ల ప్లాంట్నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నదని, ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్మాణ పనులు మొదలుపెడతామన్నారు.