ప్రిన్సిపాల్‌ సహా విద్యార్థులకు కరోనా

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లోని ఓ పాఠశాలలో 85 మంది విద్యార్థులకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. నైనిటాల్ జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయంలోని 85 మంది విద్యార్థులు కరోనావైరస్ బారినపడటంతో ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ సోకిన విద్యార్థులను వేర్వేరు హాస్టళ్లలో ఉంచారు. అంతేకాకుండా.. పాఠశాలను మైక్రో-కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు.

మొదటగా ఈ పాఠశాలలో పదకొండు మంది విద్యార్థులకు కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది. దాంతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ పాఠశాలలోని 488 మంది విద్యార్థుల నమూనాలను పరీక్ష కోసం పంపింది. ఈ ఫలితాలలో 85 మంది విద్యార్థులకు ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. డిసెంబర్ 30న పాఠశాల ప్రిన్సిపాల్‌తో సహా ఎనిమిది మంది పిల్లలకు కోవిడ్-19 సోకినట్లు గుర్తించారు. దాంతో పాఠశాల అధికారులు మిగతా పిల్లల నమూనాలను పరీక్షల కోసం పంపారు. అయితే ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగిటివ్ వచ్చిన పిల్లలు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయించుకోవాలని.. ఆ ఫలితం తర్వాతే వారిని డిశ్చార్జ్ చేస్తామని ఆరోగ్యశాఖ సిబ్బంది తెలిపారు. కాగా.. మరికొన్ని నమూనాల నివేదికలు ఇంకా రావలసి ఉందని అధికారులు తెలిపారు. డాక్టర్ల ప్రకారం.. 70 శాతం మంది విద్యార్థులు జ్వరం, దగ్గు మరియు ముక్కు దిబ్బడతో బాధపడుతున్నారు.

శనివారం ఉత్తరాఖండ్ లో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.  దాంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. గతంలో ఒక కేసు అహ్మదాబాద్‌లో, మూడు కేసులు డెహ్రాడూన్‌లో నమోదయ్యాయి. డిసెంబర్ 11న ఒక కేసు, డిసెంబర్ 27న మరో మూడు కేసులు నమోదయ్యాయి.

For More News..

టీచర్ల ఇబ్బందులు ప్రభుత్వానికి అర్థం కాకపోవడం దురదృష్టకరం

యాదాద్రికి భారీ విరాళమిచ్చిన హెటిరో