ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పేలి వ్యక్తి మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన

వికారాబాద్ జిల్లాలో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పేలి వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని గాంధీ కాలనీలో నివాసముండే సోమేశ్వర్(85) అనే వృద్ధుడు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పేలి ప్రాణాలు కోల్పోయాడు.

విద్యుత్ స్టవ్‌పై పెట్టిన రైస్ కుక్కర్ అకస్మాత్తుగా పేలి మంటలు చెలరేగడంతో.. ఆయన ఆ అగ్ని జ్వాలల్లోనే సజీవ దహనమయ్యారు. శరీరం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.