- జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో ఘటన
మొగుళ్లపల్లి (టేకుమట్ల), వెలుగు: కుక్కల దాడిలో గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి చనిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రామకిష్టాపూర్ (వి)లో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఆకునూరు చంద్రమ్మ (85) ఈ నెల 17న రాత్రి ఆరు బయటకు రాగా కుక్కలు దాడి చేశాయి. దీంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై బాధితురాలిని వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఆమె చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. కాగా, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకుని కుక్కలను అదుపు చేయాలని స్థానికులు కోరుతున్నారు.