నిర్మల్‌లో 87 సెల్ ఫోన్ల రికవరీ

నిర్మల్, వెలుగు:  చోరీకి గురైన సెల్ ఫోన్ లను గుర్తించి బాధితులకు అందజేస్తున్నామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు.  గురువారం ఎస్పీ ఆఫీస్​లో ఆమె మాట్లాడారు. 

సీఈఐఆర్ వెబ్ సైట్ లో రిజిస్టర్ అయిన ఫిర్యాదుల ఆధారంగా 87 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని బాధితులకు అందజేసినట్లు వివరించారు.