అదృష్టం ఐదు గంటలే: రూ.500 డ్రా చేద్దామని వెళ్తే ఖాతాలో రూ.87 కోట్లు.. చివరకు ఏమైందంటే..?

అదృష్టం ఐదు గంటలే: రూ.500 డ్రా చేద్దామని వెళ్తే ఖాతాలో రూ.87 కోట్లు.. చివరకు ఏమైందంటే..?

పాట్నా: బీహార్‎లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు కానీ 9వ తరగతి చదివే బాలుడి అకౌంట్లో ఏకంగా రూ.87 కోట్ల రూపాయిలు ప్రత్యక్షం అయ్యాయి. రూ.87 కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా సరిగ్గా తెలియని ఆ బాలుడు తన అకౌంట్లో అంత డబ్బు చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఇంటికి వెళ్లి జరిగిన విషయం తన తల్లికి చెప్పాడు. విషయం తెలుసుని ఆశ్చర్యపోయిన తల్లి.. మళ్లీ బ్యాంక్‎కు వెళ్లిచూడగా.. ఆ రూ.87 కోట్లు మాయం అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ సక్రా బ్లాక్‌లోని చందన్ పట్టిలో సైఫ్ అలీ అనే బాలుడు తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. 

ఈ క్రమంలోనే బుధవారం (డిసెంబర్ 18) బయటకు వెళ్లిన సైఫ్ తన అకౌంట్లో రూ.500 తీసుకుందామని ఏటీఎంకి వెళ్లాడు. అయితే, తన అకౌంట్లో ఉన్న డబ్బులు చూసి సైఫ్‎కు ఒక్కసారిగా కళ్లుబైర్లు కమ్మాయి. వందల రూపాయలు మాత్రమే ఉండే తన అకౌంట్లో ఏకంగా రూ.87 కోట్లు ఉన్నట్లు చూపించింది ఏటీఎంలో. కాసేపు ఏం జరుగుతోందో అర్థం కాక అనుమానంతో మరోసారి బ్యాంక్ బాలెన్స్ చెక్ చేసుకున్నాడు. 

అప్పుడు సేమ్ అవే రూ.87 కోట్లు చూపించింది. వెంటనే ఇంటికి వెళ్లిన బాలుడు ఈ విషయాన్ని తల్లికి చెప్పాడు. తల్లి కూడా ఫస్ట్ కొడుకులానే ఆశ్చరపోయి.. విషయాన్ని మరో వ్యక్తికి చెప్పింది. అనంతరం ముగ్గురు కలిసి బ్యాంక్‌ కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌కు వెళ్లి చూడగా బాలుడి ఖాతాలోని 87 కోట్లు మాయం అయ్యాయి. సైఫ్ అకౌంట్‎లో  రూ.532 మాత్రమే ఉన్నట్టు చూపింది. దీంతో అసలు ఏం జరుగుతోంది వారికి అర్థం కాలేదు.. ఇదిలా ఉండగానే.. కాసేపటికే సైఫ్ అకౌంట్ సర్వీస్ నిలిచిపోయింది. 

దీనిపై బ్యాంక్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై ఉత్తర బీహార్‌ గ్రామీణ బ్యాంక్‌ విచారణ జరుపుతున్నది. బాలుడు అకౌంట్ల అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుండి డిపాజిట్ అయిందనే దానిపై అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. బాలుడు అకౌంట్లో డబ్బులు జమ కావడం.. వీరు వెళ్లి చూడటం.. ఆ తర్వాత డబ్బు మళ్లీ మాయం కావడం అంతా ఐదు గంటల్లో జరిగిపోయింది. ఈ ఐదు గంటల పాటు సైఫ్ కోటీశ్వరుడయ్యాడు. ఈ ఆనందం మాత్రం మళ్లీ ఐదు గంటల్లోనే ఆవిరి అయ్యింది.