హైదరాబాద్: తల్లిదండ్రులు స్కూలుకెళ్లి చదువుకోమని చెప్పినందుకు మనస్తాపానికి గురైన 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం మల్కాజిగిరి పరిధిలోని వసంతపురి కాలనీలో జరిగిందీ ఘటన. తనకు చదువుకోవడం ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు పదే పదే చదువుకోమని చెప్పడంతో కారింగుల అర్జున్ కుమార్ (14) ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. తల్లిదండ్రులు గుర్తించేలోపే చనిపోయాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఎదిగిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడం స్థానికులను కంట తడిపెట్టించింది. మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్-బెంగళూరు టీఎస్ఆర్టీసీ బస్సుల తనిఖీ.. 16.5 కిలోల గంజాయి పట్టివేత
ఇంగ్లండ్‌పై గ్రాండ్ విక్టరీ.. వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్
1500 కోట్ల చీటింగ్.. 10 లక్షల మందిని ముంచారు
కేటీఆర్ పీఏనని చెప్పుకుంటూ.. మోసాలు చేస్తున్న మాజీ రంజీ ప్లేయర్ అరెస్ట్