రంగారెడ్డి: హయత్ నగర్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. హయత్ నగర్ నేతాజీ కాలనీకి చెందిన 8 వ తరగతి చదువుతున్న విద్యార్థి సంజయ్ కనిపించకుండా పోయాడు. మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుంచి వెళ్లి తిరిగా రాలేదు.హోంవర్క్ చేయలేదని తల్లిదండ్రులు మందలించారని ఇంట్లోంచి బయటికి వెళ్లిన సంజయ్ రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు చేస్తున్నారు పోలీసులు. నాలుగు బృందాలుగా విడిపోయి బాలుడు సంజయ్ కోసం గాలిస్తున్నారు హయత్ నగర్ పోలీసులు.