- హోం శాఖ స్పెషల్ చీఫ్ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 9 మంది అదనపు ఎస్పీలకు (నాన్ క్యాడర్) ఎస్‌పీలుగా పదోన్నతులు దక్కాయి. ప్రమోషన్లతో పాటు బదిలీలు కూడా జరిగాయి. ఈ మేరకు హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లు సహా సిద్దిపేట, జోగుళాంబ గద్వాల, మహబూబాబాద్ జిల్లా యూనిట్లు, ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీలతో కూడిన వివరాలను వెల్లడించారు. ప్రమోషన్లు, బదిలీలు పొందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
పేరు ప్రస్తుతం కొత్తగా పోస్టింగ్/ట్రాన్స్‌ఫర్
కె.గుణశేఖర్ ఏడీఎస్పీ, అడ్మిన్ (జోగుళాంబ గద్వాల) డీసీపీ, ట్రాఫిక్ (మేడ్చల్)
జి.నర్సింహారెడ్డి క్రైమ్స్–I (సైబరాబాద్) డీసీపీ, ఎస్‌బీ (రాచకొండ)
ఎస్.మల్లారెడ్డి అడిషనల్ డీసీపీ (సిద్దిపేట) డీసీపీ, ట్రాఫిక్ (రాచకొండ)
ఎమ్.శ్రీనివాస్ రావు అడిషనల్ డీసీపీ, సీటీసీ (హైదరాబాద్) ఎస్‌పీ, సీఐడీ
పి.శోభన్‌కుమార్ అడిషనల్ డీసీపీ, ఎస్‌ఓటీ (సైబరాబాద్) డీసీపీ, ఎస్‌ఓటీ, మాదాపూర్
టి.సాయికుమార్ అడిషనల్ డీసీపీ, ట్రాఫిక్ (మాదాపూర్) డీసీపీ,ట్రాఫిక్, మాదాపూర్
డి.రమేష్ అడిషనల్ ఎస్‌పీ (ఇంటెలిజెన్స్) ఎస్పీ, ఇంటెలిజెన్స్
జె.చెన్నయ్య ఏఎస్పీ క్రైమ్స్(మహబూబాబాద్) ఎస్పీ, ఐసీసీసీ
పి.విజయ్‌కుమార్ అడిషనల్ డీసీపీ (రాజేంద్రనగర్) ఎస్పీ, సీఐడీ
కె.కరుణాకర్ డీసీపీ ఎస్‌బీ (రాచకొండ) డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్
కె.మనోహర్ డీసీపీ, ట్రాఫిక్ (రాచకొండ) డీసీపీ, రోడ్ సేఫ్టీ (రాచకొండ)
డి.శ్రీనివాస్ డీసీపీ, ఎస్‌ఓటీ (మాదాపూర్) డీసీపీ, మేడ్చల్ ఎస్‌ఓటీ (సైబరాబాద్)