ఇప్పటి వరకు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీరే

ఇప్పటి వరకు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీరే

బీఆర్ఎస్ కు రోజుకో ఎమ్మెల్యే షాకిస్తున్నారు. ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ 39 స్థానాల్లో  గెలవగా ఇప్పటి వరకు  ఇప్పటి వరకు 9 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది.  

కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు

  • దానం నాగేందర్ : ఖైరతాబాద్
  • కడియం శ్రీహరి: స్టేషన్ ఘన్ పూర్
  • తెల్లం వెంకట్రావ్: భద్రాచలం 
  • పోచారం శ్రీనివాస్ రెడ్డి : బాన్సువాడ
  • సంజయ్ కుమార్: జగిత్యాల
  • కాలే యాదయ్య: చేవెళ్ల 
  • కృష్ణా మోహన్ రెడ్డి: గద్వాల్  
  • ప్రకాష్ గౌడ్ : రాజేంద్ర నగర్
  • అరికపూడి గాంధీ:శేర్లింగంపల్లి  


మరో ఆరుగురు ఎమ్మెల్సీ లు: భాను ప్రసాద్, బస్వరాజు సారయ్య,  దండె విఠల్, ఎంఎస్‌ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్‌  కాంగ్రెస్ లో చేరారు. 


అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 64 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.  కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ గెలవడంతో ఎమ్మెల్యేల సంఖ్య 65కి పెరిగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలతో  అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 74 కు చేరింది. మిత్రపక్షమైన సీపీఐని కూడా కలుపుకుంటే అది 75 అవుతుంది. ఇక బీఆర్ఎస్ కు 29, బీజేపీకి 8, ఎంఐఎంకు 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.