చార్జింగ్​ టైంలో ఈవీల్లో మంటలు9 బైకులు దగ్ధం

ఉప్పల్, వెలుగు: ఓ ఇంటి ఆవరణలో చార్జింగ్ పెట్టిన తొమ్మిది బైకులు కాలిబూడిదయ్యాయి. ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామాంతపూర్​వివేక్ నగర్ లో బుధవారం తెల్లవారుజామున 1.30 గంటలకు జరిగింది. స్థానికులు గమనించి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ బైకులు దగ్ధమయ్యాయి. ఉప్పల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎలక్షన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉండే గాదెరాజు సుధాకర్ ఇంటి పార్కింగ్​ఏరియాలో మంగళవారం రాత్రి రెండు బిజ్లీరైడ్​ఎలక్ట్రిక్​బైకులతోపాటు మరో ఏడు ఇతర బైకులను పార్క్​చేశారు. 

ఎలక్ట్రిక్​బైకులకు చార్జింగ్​పెట్టారు. అర్ధరాత్రి దాటాక ఎలక్ట్రిక్​బైకుల్లో మంటలు చెలరేగి పక్కన ఉన్న బైకులకు వ్యాపించాయి. మొత్తం తొమ్మిది బైకులు కాలి బూడిదయ్యాయి. సుధాకర్ ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు.