
భిక్కనూరు ( కామారెడ్డి), వెలుగు : మండలంలోని బస్వాపూర్‌లో తాళాలు వేసిన తొమ్మిది ఇండ్లల్లో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కొందరు గుర్తుతెలియని దుండగులు గ్రామంలోని సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి కట్ చేసి, డాకి రమేశ్ ఇంటి తాళం పగుల గొట్టి బీరువాలోని 3 తులాల బంగారు అభరణాలు, రూ. 40 వేల నగదు, వెండి వస్తువులు, నాగమణి ఇంట్లో 3 తులాల బంగారు వస్తువులు చోరీ చేశారు.
మామిడి సత్తమ్మ, సువర్ణ, ధర్మరాజు, చంద్రయ్య, స్వామి, ఇండ్లలో కూడా చోరీ జరిగింది. శుక్రవారం భిక్కనూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి క్లూస్ టీమ్స్ రప్పించి ఫింగర్ ఫ్రింట్స్ సేకరించారు. తొమ్మిది ఇండ్లల్లో దాదాపు 15 తులాల బంగారు అభరణాలు , కొంత నగదు చోరీ అయినట్లు పోలీసులు తెలిపారు.