అదుపు తప్పి మినీ బస్ బోల్తా... 9 మందికి గాయాలు

అదుపు తప్పి మినీ బస్ బోల్తా... 9 మందికి గాయాలు

పెద్దశంకరంపేట, వెలుగు: మినీ బస్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో 16 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం సోమవారం పెద్దశంకరం పేట మండలం కమలాపూర్ వద్ద 161 నేషనల్ హైవే మీద జరిగింది. మహారాష్ట్ర లోని నాందేడ్ కు చెందిన వారు  మినీ బస్ లో ఏపీలోని కర్నూల్ కు బంధువుల రిసెప్షన్ కు వెళ్లి తిరిగి నాందేడు వెళ్తున్న క్రమంలో కమలాపూర్ గ్రామ శివారులో డ్రైవర్ నిద్ర మత్తులో బస్ ను రోడ్ కిందికి దింపాడు. ఈ క్రమంలో బస్సు ముందు టైరు పగిలి బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయి. బాధితులను జోగిపేట  ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.