
ఎస్సెస్సీ ఎగ్జామ్ అంటే వందల మంది స్టూడెంట్స్ , వాళ్ల కోసం ఇన్విజిలేటర్లు, సీఎస్, డీవోలు ఉండటం సర్వసాధారణం. అయితే శనివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సీఎస్ఐ హైస్కూల్ పరీక్ష కేంద్రంలోఒకే ఒక స్టూడెంట్ పరీక్ష రాసింది. తాండూర్ మండలానికి చెందిన బయ్య అనిత అనే ప్రైవేట్ స్టూడెంట్ గతంలో అనారోగ్య కారణాలతో పరీక్ష రాయలేకపోయింది. శనివారం ఆమె పరీక్ష రాయడానికి రాగా మొత్తం తొమ్మిది మంది సిబ్బంది విధులు నిర్వహించారు. చీఫ్ సూపరింటెండెంట్ ,డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్, క్లర్క్,కానిస్టేబుల్, అటెండర్, ఇద్దరు వైద్య సిబ్బంది డ్యూటీలో ఉన్నారు. ఈ పరీక్ష కేంద్రాన్ని ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీ చేయడం మరో విశేషం.