తెలంగాణలో 9మంది ఐపీఎస్ అధికారులు బదిలీ..

తెలంగాణలో 9మంది ఐపీఎస్  అధికారులు బదిలీ..

తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీల పరంపర కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పలువురు అధికారులను బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 17వ తేదీ ఆదివారం రాత్రి మరో 9మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ చీఫ్‌గా విశ్వప్రసాద్‌, హైదరాబాద్‌ క్రైమ్‌ చీఫ్‌గా ఏవీ రంగనాథ్, వెస్ట్‌జోన్‌ డీసీపీగా విజయ్‌కుమార్, హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ చీఫ్‌గా జ్యోయల్ డెవిస్‌, నార్త్‌జోన్‌ డీసీపీగా రోహిణి ప్రియదర్శిని,  డీసీపీ డీడీగా శ్వేత, ట్రాఫిక్‌ డీసీపీగా సుబ్బరాయుడు నియమించగా.. టాస్క్‌ఫోర్స్ డీసీపీ నిఖితపంత్, సిట్‌ చీఫ్‌ గజారావు, భూపాల్‌, చందన దీప్తీలను డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్‌ చేయాలని సీఎస్ ఆదేశించారు.