హైదరాబాద్ లో డ్రగ్స్ ఓవైపు గంజాయి ఓ వైపు యువత భవిష్యత్ ను చిన్నాభిన్నం చేస్తుంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా డ్రగ్స్, గంజాయి అక్రమ మార్గాల ద్వారా హైదరాబాద్ కు చేరుతోంది. స్కూల్ విద్యార్థులు, కాలేజ్ యువత టార్గెట్ గా డ్రగ్ ఫెడ్లర్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. కిరాణ షాపుల్లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు. దీంతో స్కూల్ విద్యార్థులు ఈ చాక్లెట్లు తింటున్నారు.
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలొలోని లెనిన్నగర్ కిరాణం షాప్ లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న సునీత దేవి గోస్వామి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు బాలానగర్ SOT పోలీసులు. 9.5 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. జగద్గిరి గుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.