వెలుగు ఫోటోగ్రాఫర్, నల్గొండ : నల్గొండ జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో 265 మంది ఏఆర్ కానిస్టేబుల్స్ 9 నెలలు శిక్షణ గురువారంతో ముగిసింది. ఈ సందర్భగా ఏర్పాటు చేసిన పాసింగ్ ఔట్ పరేడ్ కు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ముఖ్యఅతిథిగా హాజయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రాణవాయువులా పోలీసులు పనిచేయాలని సూచించారు.
పోలీస్ శాఖలో అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని తెలిపారు. అనంతరం మెరిట్ సాధించిన వారికి ట్రోఫీ అందజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ కానిస్టేబుల్స్ వాళ్ల కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు.