సర్టిఫికెట్లను సరెండర్​ చేసిన 9 ఎన్​బీఎఫ్​సీలు

సర్టిఫికెట్లను సరెండర్​ చేసిన 9 ఎన్​బీఎఫ్​సీలు

ముంబై: ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సహా తొమ్మిది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్)ను సెంట్రల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సరెండర్ చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం తెలిపింది.  వీటిలో, ఐదు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు బ్యాంకింగేతర, ఆర్థిక సంస్థల వ్యాపారం నుంచి బయటికి రావడంతో సీఓఆర్​ను వెనక్కి ఇచ్చేశాయి. 

ఈ ఎన్​బీఎఫ్​సీల్లో విగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫిన్ హోల్డింగ్స్, స్ట్రిప్ కమోడియల్, అల్లియం ఫైనాన్స్, ఎటర్నైట్ ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెస్ట్, ఫినో ఫైనాన్స్ ఉన్నాయి.   అలెగ్రో హోల్డింగ్స్, టెంపుల్ ట్రీస్ ఇంపెక్స్ అండ్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, హెమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే మూడు ఎన్​బీఎఫ్​సీలు రిజిస్ట్రేషన్ అవసరం లేని, రిజిస్టర్ చేయని కోర్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కంపెనీ (సిఐసి)కి నిర్దేశించిన ప్రమాణాలను పాటించిన తర్వాత తమ సర్టిఫికెట్లను సరెండర్ చేశాయని బ్యాంక్ తెలిపింది.  ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సమ్మేళనం కారణంగా చట్టపరమైన సంస్థగా మిగిలిపోయినందున సీఓఆర్​ను సరెండర్ చేసింది.