మహబూబ్నగర్లో నాల్గో రోజు 9 నామినేషన్లు

మహబూబ్నగర్లో నాల్గో రోజు 9 నామినేషన్లు
  •     కల్వకుర్తి, కొల్లాపూర్​లో కాంగ్రెస్​ అభ్యర్థుల నామినేషన్లు   

నాగర్​ కర్నూల్​.వెలుగు :  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9 నామినేషన్లు దాఖలయ్యాయి.  నాగర్​ కర్నూల్ జిల్లాలో సోమవారం 8 నామినేషన్లు దాఖలయ్యాయి. కల్వకుర్తిలో కాంగ్రెస్​ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి నామినేషన్​ దాఖలు చేశారు. ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్​ రెడ్డి, ఐక్యతా ఫౌండేషన్​ చైర్మన్​ సుంకిరెడ్డి రాఘవేందర్​ రెడ్డి, జడ్పీ వైస్​ చైర్మన్ ​బాలాజీ సింగ్, కల్వకుర్తి మాజీ సర్పంచ్​ బృంగి ఆనంద్​ కుమార్​, పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటరాగా కసిరెడ్డి   రిటర్నింగ్​ అధికారికి నామినేషన్​  సమర్పించారు.  మాడ్గుల మండలం చంద్రాయన్ పల్లి కి చెందిన హనుమాదాస్,అచ్చంపేట మండలం లింగోటం గ్రామానికి చెందిన ఆంజనేయులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. 

కొల్లాపూర్  నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు తరపున కేతూరి వెంకటేశ్​ ఒక సెట్​ నామినేషన్   కొల్లాపూర్ ఆర్​ఓ కుమార్ దీపక్ కు అందజేశారు. అచ్చంపేట నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి మోతుకూరి నాగార్జున ఒక సెట్​ నామినేషన్ ను అచ్చంపేట రిటర్నింగ్ అధికారి గోపీరామ్ కు అందజేశారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా వడ్డె శివకృష్ణ,  ప్రజా ఏక్తా పార్టీ నుంచి బాచీపూర్ వెంకటయ్య రెండు సెట్ల  నామినేషన్ పత్రాలను ఆర్​ఓ  వెంకట్ రెడ్డికి అందజేశారు. విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి సురేందర్ రెడ్డి నామినేషన్ సమర్పించారు. 

జడ్చర్లలో అనిరుధ్​రెడ్డి నామినేషన్​
 
 జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి సోమవారం కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి జనంపల్లి అనిరుధ్​ రెడ్డి నామినేషన్​ వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.​  ఈ నెల పదవ తేదీన భారీ ర్యాలీతో మరో సెట్​ వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

జడ్చర్ల టౌన్, వెలుగు