కేసీఆర్ కొండగట్టు టూర్...  9 మంది ముందస్తు అరెస్ట్ 

సీఎం కేసీఆర్ ఇవాళ  కొండగట్టు పర్యటన నేపథ్యంలో గంగాధర మండలం రేలపల్లికి చెందిన 9 మందిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. గతంలో చర్లపల్లి బలవంతపూర్ మీదుగా తమ గ్రామానికి రోడ్డు వేయిస్తామని స్థానిక ఎమ్మెల్యే మాట ఇచ్చి తప్పడంతో సీఎం ముందు తమ నిరసన తెలిపేందుకు గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు వారిని ముందస్తుగా  అదుపులోకి తీసుకున్నారు. 

సీఎం కేసీఆర్ ఇవాళ కొండగట్టుకు వెళ్తున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్​ ద్వారా జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూ క్యాంపస్​కు సీఎం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకు చేరుకొని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ పరిసరాలను పరిశీలించిన తర్వాత జిల్లా ఉన్నతాధికారులతో కేసీఆర్​ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.