లక్ష్యానికి వయసు అడ్డంకి కాదు అంటే ఇదేనేమో.. ఈ చిన్నారి షావోలిన్ చాంపియన్​..!

లక్ష్యానికి వయసు అడ్డంకి కాదు అంటే ఇదేనేమో.. ఈ చిన్నారి షావోలిన్ చాంపియన్​..!

ఏదైనా సాధించాలనే గోల్​ ఉంటే దానికి వయసుతో సంబంధం లేదనడానికి ఈ చిన్నారే నిదర్శనం. ఈ పాప ప్రపంచ షావోలిన్ కుంగ్​ ఫూ చాంపియన్​షిప్ టైటిల్ సొంతం చేసుకున్న పది మందిలో ఒకరిగా నిలిచింది. 

ప్రపంచ షావోలిన్ కుంగ్​ ఫూ చాంపియన్ షిప్ ప్రతిఏటా నిర్వహిస్తారు. గతేడాది ఈ పోటీకి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది హాజరవుతారు. గతేడాది 124 మంది కుంగ్​ ఫూ మాస్టర్లతో ఇంటర్నేషనల్ గ్రూప్ సెంట్రల్ చైనాలో ఈ పోటీ నిర్వహించింది. అందులో భాగంగా హెనాన్ ప్రావిన్స్​కు చెందిన జాంగ్​ సిక్సువాన్​ పార్టిసిపేట్ చేసింది. ఈ చిన్నారి వయసు అప్పుడు తొమ్మిదేండ్లు. అప్పటికే నాలుగేండ్ల నుంచి శిక్షణ తీసుకుంటోంది. అయితే, పోటీలో తాను ప్రపంచ షావోలిన్ గేమ్స్​లో చాలా ఫేమస్ అయిన కుంగ్​ ఫూ మాస్టర్స్​ను ఓడించింది. దీంతో ‘షావోలిన్ కుంగ్​ ఫూ స్టార్’ టైటిల్ చిన్నారి జాంగ్​కు సొంతమైంది. 

ఈ చిన్నారి ప్రదర్శన చేసిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అందులో ఈ చిన్నారి తన బాడీని రబ్బర్​లా వంచుతూ అవలీలగా విన్యాసాలు చేసింది. అది చూసిన మాస్టర్లంతా ఆశ్చర్యపోయారు. ఇప్పటికి పది మంది మాత్రమే షావోలిన్​ కుంగ్​ ఫూ స్టార్ టైటిల్ సాధించగలిగారు. ఆ లిస్ట్​లో జాంగ్​ సిక్సువాన్​ కూడా చేరింది. ఇంత చిన్నవయసులోనే జాంగ్​ ఈ టైటిల్ సాధించడంతో ఆమె గురువు జావో జెన్​వు ఏమన్నారంటే.. ఆమెకు మార్షల్ ఆర్ట్స్​ అంటే ఎంతో ఇష్టమని, చీకటి పడిన తర్వాత కూడా ప్రాక్టీస్​ చేసేదని చెప్పారు.