హైదరాబాద్‌సిటీ, వెలుగు: తెలంగాణ భాషా సాంస్కృతిక సంస్థ, ఫరెవర్ ఫెంటాస్టిక్ థియేటర్ సంయుక్త ఆధ్వర్యంలో ‘స్టోరీ రైటింగ్’పై 90 రోజుల వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు సినిమా, నాటక రచయిత, దర్శకుడు డా.ఖాజామన్సూర్ తెలిపారు. 7 జాతీయ అవార్డులు, 9 నంది అవార్డులు పొందిన ఆయన వర్క్ షాపులో స్టోరీ ఎలా రాయాలి, ఒక ఐడియాను ఆసక్తికర స్టోరీగా ఎలా మలచాలి అనే అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.
ఇప్పటివరకు నాలుగు సీజన్లను సక్సెస్చేశామని, ఈ నెల మూడో వారంలో ఐదో సీజన్ ను ప్రారంభిస్తున్నట్టు ఖాజా మన్సూర్తెలిపారు. రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 5 గంటల నుంచి 7.30 గంటల వరకు శిక్షణ ఉంటుందని, అలాగే గూగుల్మీట్ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.
ఫిలిం స్ర్కిప్టు, వెబ్‌సిరీస్, నవలా రచన, నాటకంపై శిక్షణ కొనసాగుతుందన్నారు. ఔత్సాహికులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, వివరాలకు 77319 29399 ద్వారా వాట్సప్‌లో సంప్రదించాలని కోరారు.