భద్రాచలంలో 90 కిలోల గంజాయి పట్టివేత

భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో 90 కిలోల గంజాయిని పట్టుకున్నారు. స్పెషల్​టాస్క్​ఫోర్స్, ఎన్​ఫోర్స్​మెంట్, టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం భద్రాచంలో రెండుచోట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలంలోని చెక్​పోస్ట్​వద్ద వెహికల్స్​చెక్​చేస్తుండగా నిర్మల్ జిల్లాకు చెందిన ఎస్.కె.అద్నన్, అబ్బు, ముంబైకు చెందిన షఫీఉల్లా, ముస్తాక్ మహ్మద్ ఖాన్, ఎస్.కె.అఫ్తక్, ముస్తాక్ పోలీస్​స్టిక్కర్లు ఉన్న షిఫ్ట్​కారులో వచ్చారు.

ఆపి చెక్​చేయగా కారులో 80కిలోల500 గ్రాముల గంజాయి దొరికింది. ఒడిశాలోని మల్కన్​గిరిలో కొని ముంబై తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని, కారు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లికి చెందిన తీగల శశి, దేవి రవితేజ ఒడిశాలోని మల్కన్​గిరి నుంచి బైక్​పై 9 కిలోల 700 గ్రాముల తీసుకొస్తూ పోలీసులకు చిక్కారు. రెండు ఘటనల్లో మొత్తం 90 కిలోల 200 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు ఆబ్కారీ పోలీసులు ప్రకటించారు.