యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ అర్బన్, వెలుగు : ఉమ్మడి జిల్లాలో ఆరోరోజైన బుధవారం 90 నామినేషన్లు దాఖలు అయ్యాయి. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డితో పాటు కాంగ్రెస్‌కు చెందిన వల్లందాసు ఆదినారాయణ, గుండు చిరంజీవులు, నీల నర్సింహ, బీరం సతీశ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఆలేరు అసెంబ్లీకి ఎమ్మెల్యే గొంగిడి సునీత తరఫున డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల అయిలయ్య తరఫున ఆయన భార్య అనిత, పార్టీ నేత యాదగిరి గౌడ్తలో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. విద్యార్థి రాజకీయ పార్టీ తరపున బుగ్గ శ్రీకాంత్, ధర్మ సమాజ్ పార్టీ తరపున రాసాల వినోద్‌కుమార్, ఇండిపెండెంట్లుగా మొరిగాడి కృష్ణ, జలగం శ్రీకాంత్, పాలడుగు ఉపేంద్ర నామినేషన్లు వేశారు.
నల్గొండలో 47 మంది 52 సెట్లు..
నల్గొండ జిల్లాలో 47 మంది అభ్యర్థులు 52 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. దేవరకొండలో కాంగ్రెస్ నుంచి నేనావత్ బాలునాయక్, తెలంగాణ రిపబ్లికన్ పార్టీ నుంచి కేతావత్ రమేష్ బాబు, ఇండిపెండెంట్ గా కెలావత్ వస్య, నాగార్జునసాగర్‌లో విద్యార్థి రాజకీయ పార్టీ నుంచి సిలుముల గోపి, డీఎస్పీ నుంచి మామిడి సైదయ్య, అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి అనిత మసున, ఇండిపెండెంట్లుగా ఊట విజయకుమార్, చిట్టి మల్ల సైదులు, కామల్ల జనార్ధన్, గావలపల్లి సుబ్రహ్మణ్యం నామినేషన్ వేశారు. మిర్యాలగూడలో జన శంఖారావం పార్టీ నుంచి పి. అశోక్ రెడ్డి, సీపీఎం నుంచి వస్కుల గోపి, యుగ తులసి పార్టీ నుంచి రాజ భార్గవ కర్నాటి
డెమొక్రటిక్ ప్రిఫరెన్స్ పార్టీ నుంచి సంక్రాంతి రాజశేఖర్, బహుజన ముక్తి పార్టీ నుంచి పెద్ద అంజయ్య వజ్జగిరి, ఇండిపెండెంట్లుగా ఉషా నాయక్, మల్లాది వెంకట రామ రెడ్డి, అన్నపూర్ణ, మహేశ్వరం చిరంజీవి, పి.అనిల్, సందీప్, లావూరి సైదా నామినేషన్ దాఖలు చేశారు. నల్గొండలో సీపీఎం నుంచి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, ప్రజా ఏక్తా పార్టీ నుంచి చెడుబుద్ధి రమేశ్, ఇండిపెండెంట్లుగా గండికోట వెంకట లక్ష్మణ్, పొట్ట బత్తుల సైదులు, తన్నీరు యాదయ్య, సయ్యద్ అప్రోజ్, చింతకింది స్వామి కుమార్, జనిగల రాములు, మునుగోడులో బీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, డీఎస్పీ నుంచి ఏర్పుల గాలయ్య, అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ నుంచి కట్ట ప్రభాకర్ రెడ్డి
భారతీయ స్వదేశీ కాంగ్రెస్ నుంచి ఏలే వెంకటేశం, బీఎస్పీ నుంచి శంకరాచారి ఇండిపెండెంట్లుగా అంతటి హరిప్రసాద్ గౌడ్, ఆంబోతు సికిందర్, మెగావత్ చందు, పూదరి మల్లేశ్, ఎర్ర పరమేశ్, దుడుకు లక్ష్మీనారాయణ, మాధవన్ వెంకటేశ్వర్లు, నకిరేకల్‌లో డీఎస్పీ నుంచి యాతాకుల వెంకన్న, తెలంగాణ రిపబ్లికన్ నుంచి మేడి సంతోష్, సీపీఎం నుంచి బొజ్జ చిన్న వెంకులు, ఇండిపెండెంట్లుగా ఏర్పుల నరేశ్, కొమ్ము శోభారాణి నామినేషన్ వేశారు.
సూర్యాపేటలో 24 నామినేషన్లు..
సూర్యాపేట జిల్లాలో బుధవారం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. హుజూర్ నగర్‌లో బీజేపీ నుంచి చల్లా శ్రీలత రెడ్డి, డీఎస్పీ నుంచి ఆరేండ్ల జ్యోతి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి పిల్లమర్రి లావణ్య, ఇండిపెండెంట్లుగా గంగిరెడ్డి కోటి రెడ్డి,ఉపేందర్ తండు, జాజుల శ్రీకాంత్ నామినేషన్ వేశారు. కోదాడలో బీఆర్ఎస్ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్ (రెండు సెట్లు) , బీఎస్పీ నుంచి పిల్లుట్ల శ్రీనివాస్, సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి సంపంగి అఖిల్, ఇండిపెండెంట్లుగా కొల్లు లక్ష్మీ నారాయణ రావు
షేక్ మస్తాన్ , పచ్చిపల్ల రామ కృష్ణా యాదవ్, చకరాల లింగయ్య నామినేషన్లు వేశారు. సూర్యాపేటలో బీఎస్పీ నుంచి వట్టె జానయ్య యాదవ్, కార్మిక యూవ చైతన్య సమితి నుంచి నాగరాజు, సీపీఎం నుంచి వరికుప్పల వెంకన్న, డీఎస్పీ నుంచి చెరుకు కిరణ్ కుమార్, మచ్చ వీరాకుమారి, ఇండిపెండెంట్లుగా అర్రురి వెంకటేశ్వర్లు , మారం వెంకట రెడ్డి, తుంగతుర్తిలో యుగ తులసి పార్టీ నుంచి బైగరి ఆనంతయ్య, ఇండిపెండెంట్లుగా కొమ్ము జోహార్, కొంగరి మల్లయ్య నామినేషన్ వేశారు.