అండర్‌పాస్, ఫ్లైఓవర్ పనులను డిసెంబర్‌లోపు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ఎం.దానకిశోర్అధికారులను ఆదేశించారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఎల్బీనగర్లో నిర్మాణంలో ఉన్న అండర్‌పాస్, ఫ్లైఓవర్పనులను స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. అలాగే నాగోలులో జరుగుతున్న వ్యూహాత్మక రహదారుల నిర్మాణ పనులను పరిశీలించారు. వనస్థలిపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంకుడు గుంత నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ ఎల్బీనగర్ జంక్షన్‌లో నిర్మాణంలో ఉన్న అండర్ పాస్‌ను డిసెంబర్ లోగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ విభాగం ఇంజినీర్లను ఆదేశించారు. అండర్ పాస్ నిర్మాణంతో ఎల్బీనగర్ చౌరస్తాలో దాదాపు 90% ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయన్నారు. అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రూ.42.74 కోట్లతో ఎల్బీనగర్ జంక్షన్‌లో ఎస్‌ఆర్‌డీపీ పనులు జరుగుతున్నాయని తెలిపారు. 520 మీటర్ల పొడవున్న అండర్ పాస్‌లో ఎల్బీనగర్ ఎడమ వైపు నిర్మాణంలో 17 రాఫ్ట్‌లు, 76 రీటైనింగ్ లిఫ్ట్‌లు,111 ప్రీకాస్ట్ బాక్స్ వాల్ సెగ్మెంట్లు, 49 బాక్స్ ప్రీ స్లాబ్ ప్లాంక్‌ల నిర్మాణం పూర్తయ్యిందని వివరించారు. భూ, ఆస్తుల సేకరణకు స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ల సహకారం ఉండాలని కోరారు. ఎల్బీనగర్– దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే మార్గంలో కుడివైపు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆరు పిల్లర్ల నిర్మాణం, మరో ఆరింటికి పునాదులు తీసినట్లు తెలిపారు. కామినేని జంక్షన్‌లో కుడివైపు ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 1600ఎంఎం మంచి నీటి సరఫరా పైప్‌లైన్ తొలగించాల్సి ఉందని అధికారులు వివరించారు. రూ. 38,27కోట్లతో బైరమల్‌గూడ జంక్షన్ వద్ద చేపట్టిన ఫ్లైఓవర్నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. కుడి వైపు దాన్ని డిసెంబర్‌లోపు ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. అనంతరం సాగర్ రింగ్‌రోడ్ సమీపంలోని బైరమల్‌గూడ చెరువు అభివృద్ధి పనులను కమిషనర్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ శ్రీధర్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ విజయకృష్ణ, ఏఎంహెచ్‌ఓ మల్లికార్జున్, స్థానిక కార్పొరేటర్ విఠల్ రెడ్డి, సంజయ్, చింతల రవి తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 5లోపు 600 నిర్మించేలా..
హైదరాబాద్, వెలుగు: నగరంలో మంగళవారం ఒక్కరోజే 400 ఇంకుడు గుంతల నిర్మాణానికి జలమండలి శ్రీకారం చుట్టింది. జూన్ 5 పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొత్తగా 600 ఇంకుడు గుంతలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వనస్థలిపురం జడ్పీ హైస్కూల్ లో జరిగిన నిర్మాణ కార్యక్రమంలో జలమండలి ఎండీ దానకిశోర్ పాల్గొన్నారు. ఆరు వాక్, 30 ఎన్జీవో ప్రతినిధులు, జలమండలి అధికారులు, సిబ్బంది కలిసి మంగళవారం ఒక్కరోజు 400 ఇంకుడు గుంతలు తవ్వారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ నగరంలో భూగర్భ జలాలు వేగంగా ఇంకిపోతున్నాయని,పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉన్న ఇంకుడు గుంతలను పునరుద్ధరించామని, మరికొన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.ఎం.సత్యనారాయణ, సెకండరీ ట్రాన్స్ మిషన్ డైరెక్టర్ డా.పి.ఎస్. సూర్యనారాయణ, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి.రవి, ప్రాజెక్టు-2 డైరెక్టర్ డి. శ్రీధర్ బాబు రెవెన్యూ డైరెక్టర్ బి.విజయ్ కుమార్ రెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ వి.ఎల్.ప్రవీణ్ కుమార్, సీజీఎమ్‌లు స్థానిక 100 మంది మేనేజర్లు, ఎన్జీవోల ప్రతినిధులతో పాటు 600 మంది వాక్ వలంటీర్లు ఉన్నారు.