- ట్యాక్స్ క్లెయిమ్ చేసిన అమౌంట్ రూ.1,070 కోట్లు
న్యూఢిల్లీ: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లను ఫైల్ చేసేటప్పుడు 90 వేల మంది ఉద్యోగులు తప్పుగా ట్యాక్స్ డిడక్షన్స్‌ను క్లెయిమ్ చేశారని ప్రభుత్వం ప్రకటించింది. 80 సీ, 80 డీ, 80ఈ, 80జీ, 80జీజీబీ, 80జీజీసీ సెక్షన్ల కింద వీరు ట్యాక్స్ డిడక్షన్స్ క్లెయిమ్ చేశారని, ఫలితంగా ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయం తగ్గిందని తెలిపింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు.
తప్పుగా ట్యాక్స్ మినహాయింపులను క్లెయిమ్ చేసిన వారు తమ క్లెయిమ్స్‌ను విత్‌డ్రా చేసుకున్నారని, రూ.1,070 కోట్ల విలువైన క్లెయిమ్స్ వచ్చాయని వివరించింది. పొలిటికల్ పార్టీలకు చేసే డొనేషన్లను ఆదాయం నుంచి మినహాయింపు పొందడానికి సాయపడే 80జీజీబీ లేదా 80జీజీసీ కింద వాస్తవం కంటే ఎక్కువ డిడక్షన్‌ను ఐటీఆర్‌లో క్లెయిమ్ చేశారు.