
ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా రాజేష్ చికిలే దర్శకత్వంలో యం.బంగార్రాజు నిర్మించిన చిత్రం ‘మధురం’. టీనేజ్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ చిత్రానికి ‘ఎ మెమొరబుల్ లవ్’ అనేది ట్యాగ్ లైన్. ఏప్రిల్ 18న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇదొక క్లీన్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, ఈ సినిమా తనకు టర్నింగ్ పాయింట్ అవుతుందని హీరో ఉదయ్ రాజ్ అన్నాడు.
ALSO READ | కోర్ట్ మూవీ టీమ్ ని అభినందించిన మెగాస్టార్ చిరు.. ఎమోషనల్ అయిన శివాజి..
ఈ చిత్రంలో తన క్యారెక్టర్ అందర్నీ అలరిస్తుందని వైష్ణవి సింగ్ చెప్పింది. దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ ‘1990 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ ఇది. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’ అని చెప్పాడు. ఏప్రిల్ 18న విడుదలవుతోన్న ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందని నిర్మాత బంగార్రాజు అన్నారు.