ఒకే ట్యూషన్‌కు వెళ్లిన 91 మంది విద్యార్థులకు కరోనాసోకిన ఘటన కేరళలో జరిగింది. మలప్పురంలోని రెండు స్కూల్స్‌కు చెందిన 192 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. వారిలో 91 మంది ప్రతిరోజూ ఒకే ట్యూషన్‌కు వెళ్తారని తేలింది.
‘కరోనా పాజిటివ్‌గా తేలిన 192 మందిలో 91 మంది విద్యార్థులు ఒకే ట్యూషన్ సెంటర్‌కు హాజరయ్యారు. ఆ ట్యూషన్ సెంటర్‌ను పోలీసులు ప్రస్తుతం సీజ్ చేశారు. పాజిటివ్‌గా తేలిన విద్యార్థులే కాకుండా.. ఇక్కడకు వచ్చే మిగతా విద్యార్థులు కూడా హోం ఐసోలేషన్‌లో ఉండాలి. వారందిరికీ టెస్టులు చేయబడతాయి’అని ఎడ్యుకేషన్ ఆఫీసర్ రమేష్ కుమార్ తెలిపారు. ముందస్తు చర్యగా పైన పేర్కొన్న రెండు పాఠశాలలకు దగ్గరగా ఉన్న మూడో పాఠశాలను కూడా మూసివేశామని ఆయన తెలిపారు.
ట్యూషన్ సెంటర్‌కు హాజరైన విద్యార్థులను బుధవారం పరీక్షించనున్నట్లు జిల్లా వైద్య అధికారి డాక్టర్ సకీనా తెలిపారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, చుట్టుపక్కల ప్రాంతాల 2 వేల మందికి పరీక్షలు చేస్తామని ఆమె తెలిపారు.
మొదటగా ఒక పాఠశాలలో ఒక విద్యార్థి మరియు మరొక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు పాజిటివ్‌గా పరీక్షించారు. దాంతో ముందుజాగ్రత్త ప్రాతిపదికన రెండు స్కూళ్లలో కలిపి దాదాపు 600 మందికి పైగా సామూహిక పరీక్షలు చేశాం. వారిలో 192 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో ఒక పాఠశాల నుంచి 149 మంది విద్యార్థులు, 39 మంది ఉపాధ్యాయులుండగా.. మరో పాఠశాల నుంచి 43 మంది విద్యార్థులు, 33 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రస్తుతం విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు టెస్టింగ్ కొనసాగుతుంది.
For More News..