
సెలూన్ లో కటింగ్ చేయించుకునేందుకు వెళ్లిన 84మందితో పాటు ఏడుగురు వర్కర్ల కి వైరస్ సోకినట్లు యూకే మీడియా సంస్థ సన్ యూకే కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. సుదీర్ఘ లాక్ డౌన్ తరువాత సెలూన్లకు, బ్యూటీ పార్లర్లకి కస్టమర్ల తాకిడి ఎక్కువైంది. దీంతో ఎప్పుడు ఎవరికి కరోనా సోకుతుందోననే భయాందోళనలు మొదలవుతున్నాయి
తాజాగా అమెరికా మిస్సౌరీలో లాక్ డౌన్ ఎత్తేయడంతో స్థానికులు గ్రేట్ క్లిప్స్ అనే సెలూన్ లో కటింగ్ చేయించుకునేందుకు వెళ్లారు. అలా మే 12నుంచి మే 21వరకు సెలూన్ లో కష్టమర్ల రద్దీ పెరిగింది. అదే సమయంలో సెలూన్ లో పనిచేస్తున్న వర్కర్ కి కరోనా సోకింది. కరోనా లక్షణాలు బయటపడ్డ ట్రీట్ మెంట్ తీసుకోకుండా విధులు నిర్వహించాడు. అదే క్రమంలో సెలూన్ కి వెళ్లిన ఆ కష్టమర్లకు వైరస్ లక్షణాలు బయట పడ్డాయి.
దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు..గ్రేట్స్ క్లిప్స్ సెలూన్ లో కటింగ్ చేయించుకున్న కష్టమర్లకు, అందులో పనిచేస్తున్న వర్కర్లకు టెస్ట్ లు నిర్వహించారు. ఈ టెస్ట్ ల్లో మొత్తం 91మందికి కరోనా సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వారిని అత్యవసర చికిత్స కోసం ఐసోలేషన్ లోకి తరలించారు.