టెన్త్​లో జనగామకు ఫోర్త్​ ప్లేస్​

వరంగల్‍, వెలుగు : పదో తరగతి పబ్లిక్‍ ఫలితాల్లో వరంగల్‍ జిల్లా రాష్ట్రస్థాయి జాబితాలో 92.20 శాతం ఉత్తీర్ణత సాధించింది. రాష్ట్ర స్థాయిలో జిల్లా 22వ స్థానంగా ఉంది. పదో తరగతి పరీక్షలకు బాలురు 4832 మంది, బాలికలు 4613తో మొత్తం 9445 మంది హాజరవగా, అబ్బాయిల్లో 4403 మంది, అమ్మాయిలు 4305 మందితో మొత్తంగా 8708  మంది ఫలితాలు సాధించారు.  

టాప్ 'టెన్'​ లో హనుమకొండ

హనుమకొండ, వెలుగు : పదో తరగతి ఫలితాల్లో హనుమకొండ జిల్లా 95.99 శాతంతో పదో స్థానం సంపాదించింది. 12,020 మందికి 11,538 మంది విద్యార్థులు పాస్​అయ్యారు. బాలురు 6,395 మంది పరీక్షలకు హాజరుకాగా 6,074 మంది పాస్ అయ్యారు. 5,625 మంది బాలికలకు 5,464 మంది ఉత్తీర్ణత సాధించారు. 

ములుగు జిల్లాలో 94.45శాతం ఉత్తీర్ణత.. 

ములుగు, వెలుగు : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ములుగు జిల్లాలో 94.45శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 21మంది విద్యార్థులు 10/10జీపీఏ సాధించగా కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందించారు. ములుగు జిల్లా రాష్ర్టంలో 13వస్థానంలో నిలిచినట్లు డీఈవో పాణిని తెలిపారు. మొత్తం 3081మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2910మంది ఉత్తీర్ణత సాధించారు.  

జనగామకు ఫోర్త్ ప్లేస్..​

జనగామ అర్బన్, వెలుగు : టెన్త్ రిజల్ట్స్ లో జనగామ జిల్లా రాష్ర్టంలో నాల్గో స్థానంలో  నిలిచింది. మొత్తం 98.16 ఉత్తీర్ణత సాధించారు. 6692 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 6569 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 3076 ఉండగా, బాలికలు3493 మంది ఉన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్​, డీఈవో రాము అభినందించారు.  

12వ స్థానంలో మహబూబాబాద్..

మహబూబాబాద్, వెలుగు : టెన్త్ ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా 94.62 శాతంతో 12వ స్థానంలో నిలిచింది. జిల్లాలో బాలురు 4262 మంది, బాలికలు 3916 మంది మొత్తంగా 8178 మంది పరీక్షలు రాయగా, బాలురు 3998, బాలికలు 3740 మొత్తంగా 7738 మంది ఉత్తీర్ణత సాధించినట్లు డీఈవో రామారావు తెలిపారు.