యాదాద్రి, వెలుగు : లోక్సభ ఎన్నికల పర్యవేక్షణ, తనిఖీల్లో భాగంగా భువనగిరి లోక్సభ పరిధిలోని ఏడు సెంబ్లీల్లో రూ.9,43,17,069 స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల ఆఫీసర్, కలెక్టర్హనుమంతు జెండగే తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్వాధీనం చేసుకున్న నగదు, ఆభరణాలను జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఉంచినట్టు చెప్పారు.
ఎన్నికలకు సంబంధం లేని వాటిని గ్రీవెన్స్ కమిటీ పరిశీలించి తిరిగి ఇస్తుందన్నారు. 'సీ' విజిల్ యాప్, 1950 హెల్ప్ లైన్ ను అందరూ వినియోగించుకోవాలని, ఎన్నికల ప్రవర్తనా నియమాళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయాలన్నారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఈవీఎం డిస్ట్రిబూషన్
రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. నియోజకవర్గ కేంద్రమైన భువనగిరిలో జూన్ 4 న కౌంటింగ్ ఉంటుందన్నారు. మే 13న అందరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అడిషన్కలెక్టర్ బెన్షాలోమ్, డీసీపీ రాజేశ్చంద్ర ఉన్నారు.