గ్లోబల్​ బ్యాంకింగ్​ క్రైసిస్​ ఎఫెక్ట్​ మనపై ఉండదు : సోమ శంకర​ప్రసాద్​

గ్లోబల్​ బ్యాంకింగ్​ క్రైసిస్​ ఎఫెక్ట్​ మనపై ఉండదు : సోమ శంకర​ప్రసాద్​

కోల్​కతా: గ్లోబల్​ బ్యాంకింగ్​ క్రైసిస్​ ఎఫెక్ట్​ మన దేశంలోని బ్యాంకులపై పడదని, ఎందుకంటే మన బ్యాంకులు ఎక్కువగా రిటెయిల్​ డిపాజిట్లపైనే ఆధారపడతాయని యూకో బ్యాంక్​ ఎండీ సోమ శంకర​ ప్రసాద్​ చెప్పారు. మన దేశంలోని బ్యాంకుల డిపాజిట్లలో 90–95 శాతం రిటెయిల్​ డిపాజిట్లేనని పేర్కొన్నారు. 

ఈ డిపాజిటర్లందరూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారని వివరించారు. అమెరికాలోని రెండు బ్యాంకులు, ఆ తర్వాత  క్రెడిట్​స్వీస్ ​సమస్యలతో గ్లోబల్​గా బ్యాంకింగ్​ క్రైసిస్​ తలెత్తింది. ఈ ఎఫెక్ట్​ వల్ల మన పబ్లిక్​ సెక్టార్​ బ్యాంకులకు ఎలాంటి ముప్పూ లేనేలేదని శంకర ప్రసాద్​ వెల్లడించారు. లోన్​పోర్ట్​ఫోలియోలలో కూడా రిటెయిల్​ లోన్ల వాటా 60 శాతం దాకా ఉంటుందని పేర్కొన్నారు. మన  దేశంలో రూ. 5 లక్షల దాకా డిపాజిట్లకు గ్యారంటీ ఉందని, ఇది సరిపోతుందని అన్నారు. 

పశ్చిమ దేశాల తరహాలో మన దేశంలోని బ్యాంకింగ్​కు సమస్యలు వచ్చే అవకాశాలు లేవని పేర్కొన్నారు. ఆ దేశాలలో బ్యాంకులు కుప్పకూలడం సాధారణమని చెప్పారు. గత 10, 15 ఏళ్ల కాలంలో మన దేశంలో ఒక్క బ్యాంకు ఫెయిలవడానికి కూడా ఆస్కారం ఇవ్వని విషయాన్ని శంకర ప్రసాద్​ గుర్తు చేశారు.