లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో దేశంలో ఈ సారి ఓటర్ల సంఖ్య 96 కోట్లకు చేరిందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వీరిలో మహిళలు 47 కోట్ల మంది ఉన్నారని తెలిపింది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి 5 కోట్ల ఓట్లు పెరిగినట్లు చెప్పింది. మొత్తం ఓటర్లలో 1.73 కోట్ల మంది 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారేనని తెలిపింది. అలాగే మొత్తం ఓటర్లలో దివ్యాంగులు 18లక్షల మంది ఉన్నట్లు చెప్పింది.
దేశంలోమొత్తం ఎన్ని ఓట్లంటే?
- మొత్తం ఒటర్ల సంఖ్య: 96 కోట్లు
- మహిళా ఓటర్లు: 47 కోట్లు
- 18-19 ఏళ్ల వయసు వాళ్లు: 1.73 కోట్లు
- పోలింగ్ కేంద్రాలు: 12 లక్షలు
- పోలింగ్ సిబ్బంది: 1.5 కోట్ల మంది
- దివ్యాంగుల ఓట్లు: 18 లక్షల మంది
- 1951లో ఓటర్లు: 17.32 కోట్ల మంది
- 1957లో ఓటర్లు: 19.37 కోట్ల మంది
- 2019లో ఓటర్లు: 91.02 కోట్ల మంది
- తొలి లోక్ సభలో : 45 శాతం పోలింగ్
- 2019 లోక్ సభ ఎన్నికల్లో: 67 శాతం