96 ఏళ్ల ఓల్డెస్ట్ స్టూడెంట్

96 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేసిండు
ఇటలీలో ఓల్డెస్ట్ స్టూడెంట్ పాటెర్నో

రోమ్: చదువుకు ఏజ్ తో సంబంధం లేదని నిరూపించాడు ఇటలీకి చెందిన గ్యుసెప్పె పాటెర్నో. 96 ఏళ్లవయసులో డిగ్రీ పూర్తిచేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలన్న తన కలను నిజం చేసుకున్నారు. పాలెర్మో యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఓల్డె స్ట్స్టూడెంట్ గా నిలిచారు. ఈ వారం డిగ్రీ పట్టాఅందుకోనున్నారు. ‘నాలెడ్జ్ సూట్ కేస్ లాంటింది. దాన్ని నేను నాతో మోసుకెళ్లగలను. నాకు అది ఖజానా లాంటిది. ఏజ్ లో అందరికంటే ఎక్కువ ఉండవచ్చు. నేను అందరిలాగే నార్మల్ పర్సన్ ను. 90 ఏళ్లప్పుడే పాలెర్మో యూనివర్సిటీలో హిస్టరీ, ఫిలాసఫీలో డిగ్రీ చదివేందుకు ఎన్రోల్ చేసుకున్నా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదనుకుని 2017లో మరోసారి ఎన్ రోల్ చేసుకున్నా. ఇప్పటికే ఆలస్యమైనా మూడేళ్ల డిగ్రీ పూర్తిచేస్తానన్న నమ్మకం ఉండేది’ అని గ్యుసెప్పె పాటెర్నో అన్నారు. సిసిలీలో పేద కుటుంబంలో పుట్టిన గ్యుసెప్పె స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రమే పూర్తిచేశారు. నేవీలో చేరి సెకండ్ వరల్డ్ వార్ లో పాల్గొన్నారు.

For More News..

పెళ్లయి.. ఒక పిల్లాడు.. అయినా ఇంటర్‌‌‌‌లో టాపర్ గా..

రాఖీ పండుగకు వెళ్తూ అన్న కళ్లెదుటే చెల్లెలి మృతి

శాంపిల్ తీసుకోకుండానే నెగెటివ్ గా మెసేజ్