![వరల్డ్లోనే ఫస్ట్..AI అత్యధికంగా వినియోగిస్తున్నది మనమే..](https://static.v6velugu.com/uploads/2025/02/96percent-indian-professionals-using-ai-for-work-highest-in-world_2EjQyghLYU.jpg)
ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ప్రభావం ఎంతుందో మనందరికి తెలుసు. ఈ రంగం,ఆ రంగం అని లేదు.. అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరించింది. అతి తక్కువ టైంలో ప్రపంచవ్యాప్తంగా AI వినియోగం బాగా పెరిగిపోయింది. అయితే AI ని ఎక్కువగా వినియోగిస్తున్నది మనమేనట.. ఇది ఇటీవల జరిగిన సర్వేలు చెబుతున్నాయి.
2025 గ్లోబల్ వర్క్ ప్లేస్ స్కిల్స్ స్టడీ అనే పేరుతో ఎమొరిటస్ ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం AI వినియోగంపై సంచలన విషయాలు తెలిశాయి. భారతీయుల కెరీర్ ను AI మారుస్తోందని.. 94శాతం మంది భారతీయ నిపుణులు AI వాడుతున్నారని.. వారి కెరీర్ పురోగతికి కీలకమని నమ్ముతున్నారని వెల్లడించింది.
18దేశాల్లో 6వేల మందికి పైగా నిపుణులను సర్వే జరిగింది. ఈ సర్వేల్లో AI వాడకంలో భారత్ ముందుందని, 1700 మంది భారతీయులలో 96శాతం మంది AI సాధనాలను ఉపయోగిస్తున్నారని తెలిపింది.ఇది US (81%) ,UK (84%) కంటే చాలా ఎక్కువ. ఏఐ వాడకంలో 95శాతం మంది భారతీయ కార్మికులు ఉత్పాదకత పెరిగింది. ఇది ప్రపంచ సగటును అధిగమించిందని నివేదించారు.
టెక్నాలజీలో పోటీ తత్వాన్ని కొనసాగించాలంటే.. AI స్కిల్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. 90 శాతం మంది ఫ్యూచర్ కెరీర్ సక్సెస్ కు AI కీలకమని భావిస్తున్నారు. 94 శాతం మంది కెరీర్ వృద్ది, పరిశ్రమలలో వైవిధ్యానికి AI స్కిల్స్ అవసరమని నమ్ముతున్నారు. ఇది ప్రపంచ సగటు 87 శాతం కంటే చాలా ఎక్కువ. ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువమంది కోరుకునే స్కిల్స్ లలో బెస్ట్ వన్ మెషీన్ లర్నింగ్ అని సర్వేలో తేలింది.
ఈ అధ్యయనం భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న ఐదు స్కిల్స్ను కూడా హైలైట్ చేస్తుంది. అవి AI అభివృద్ధి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై పట్టు సాధించడం, ప్రభావవంతమైన కమ్యూనికేషన్, మెషిన్ లెర్నింగ్, వ్యూహాత్మక నాయకత్వం. ఎమెరిటస్ CEO అశ్విన్ దామెరా ప్రకారం.. ఈ ఫలితాలు పని భవిష్యత్తును రూపొందించడానికి AIని ఉపయోగించుకోవడంలో భారతదేశం చురుకైన విధానాన్ని ప్రదర్శిస్తాయి.
భారతదేశం ఒక టెక్ హబ్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నందున దేశ ఆర్థిక వృద్ధిని,శ్రామిక శక్తి పోటీతత్వాన్ని రూపొందించడంలో AI-స్కిల్స్ పెంపుదల కీలకం అవుతుంది.