- 153 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత
- ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 92శాతం పాస్
హైదరాబాద్, వెలుగు: పదో తరగతి ఫలితాల్లో బీసీ గురుకులాలు రాష్ట్ర సగటు కంటే ఎక్కువ పాస్ పర్సంటేజీ నమోదైంది. 98.25 శాతం మంది స్టూడెంట్లు ఉత్తీర్ణులైనట్టు బీసీ గురుకులాల సెక్రటరీ సైదులు తెలిపారు. రాష్ట్రంలో 261 గురుకుల స్కూల్స్ ఉండగా.. 153 పాఠశాలల్లో 100 శాతం మంది పాస్ అయ్యారని మంగళవారం ప్రకటనలో తెలిపారు.
391 మంది స్టూడెంట్స్ 10 జీపీఏ సాధించారని పేర్కొన్నారు. ఈ ఏడాది 17,845 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాయగా వారిలో 17,533 మంది పాస్ అయ్యారని తెలిపారు. వీరిలో 8,853 మంది బాలికలు, 8,680 మంది బాలురు ఉన్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులను, సిబ్బందిని బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం అభినందించారు. ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లు, హాస్టల్స్, ఆశ్రమ స్కూల్స్లో 92.60% పాస్ అయినట్లు సెక్రటరీ శరత్, డైరెక్టర్ ఈవీ నరసింహరెడ్డి మంగళవారం పత్రిక ప్రకటనలో తెలిపారు. మొత్తం 186 స్కూళ్లలో 38 మందికి 10 జీపీఏ సాధించినట్లు వెల్లడించారు. మొత్తం 7,913 మంది పరీక్షలు రాయగా 7,093 మంది స్టూడెంట్స్ పాసైనట్టు అధికారులు పేర్కొన్నారు.