98 ఏళ్ల ఈ బామ్మ ఎందరికో ఆదర్శం

ఎనుకటి మనుషులు గట్టిగా ఉంటారంటారు...అవును నిజమే...ఈ పెద్దావిడను  చూస్తే అదే  అనిపిస్తొంది...60 ఏళ్లకే జీవితం అయిపోయింది అనుకునే వాళ్లకు ఈమె ఆదర్శంగా నిలుస్తొంది..వందేళ్లకు చేరువలో ఉన్నా అదేమి లెక్క చేయకుండా  పోటీ పడి వ్యవసాయ పనులు చేస్తొంది....కలుపు తీయడం, నీళ్లు పెట్టడం, ఇలా ఏదీ తీసుకున్నా ఎలాంటి అలసట లేకుండా ఉదయం నుంచి సాయంత్రం దాక, తన పొలంలో పనిచేస్తూ అందరిని ఆలోచింప చేస్తొంది.

ఈ పెద్దమ్మ పేరు మునిరత్నమ్మ.... చిన్న నాటి నుంచి వ్యవసాయమే చేస్తూ జీవనం కొనసాగించిన ఈవిడ చిత్తూరు జిల్లా వాసి....గత  30 ఏళ్ల కింద హైదరాబాద్ కు వచ్చారు...రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం,తారామతి పేట విలేజ్  దగ్గర 17 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు....హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్  లో ఉండే ఈవిడ ప్రతి రోజు తనకున్న ప్రక్రుతి వ్యవసాయ క్షేత్రానికి వెళ్తూ  ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల పనులు చేసుకుని ఇంటికి తిరిగి రావడం ఈమె రోజూ చేసే పని....

వాస్తవానికి ఇపుడున్న జనరేషన్ లో 60 ఏళ్లు దాటితే వయసు మీద పడింది అనుకుంటారు...చాలా మంది ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతుంటారు...కాని మునిరత్నమ్మ దానికి విరుద్దం...ఈమెకు ఇపుడు 98 వయసు....అంటే వందకు రెండేండ్లు మాత్రమే తక్కువ...ఇంత వయసు వచ్చినా....30 నుంచి 40 వయసున్న వారికి దీటుగా వ్యవసాయ పనులు చేస్తు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తొంది...అంతే కాదు ఆర్గానిక్ సాగు లో ఎన్నో అవార్డులను ఈమె సొంతం చేసుకుంది.... ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, 2014లో కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడుతో పాటు పలువురుతో వ్యవసాయరంగంలో అవార్డులు సొంతం చేసుకుంది....

అప్పట్లో తినే తిండి కూడా అలాగే ఉండేది మరి...రసాయనికి ఎరువులు చాలా తక్కువగా వాడే వారు...ప్రకృతి వ్యవసాయానికే ప్రాధాన్యత ఇచ్చే వారు....ఇపుడు తనకున్న వ్యవసాయ క్షేత్రంలో తన కుమారిడితో పాటు పూర్తిగా సేంద్రియ పద్దతిలో వ్యవసాయం చేస్తున్నారు....వరి, వివిద రకాల పండ్ల తోటలు,వివిద రకాల పంటలు పండిస్తూ ఆర్గానికి సాగు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు...

తనతో పాటు కొన్నేళ్లుగా వ్యవసాయ పనులు చేస్తున్న వారు సైతం ఈ పెద్దమ్మ చేస్తున్న పనులు చూసి ఔరా అంటున్నారు...తన దగ్గరే వ్యవసాయానికి సంబందించిన చాలా పనులు నేర్చుకున్నామంటున్నారు....కలుపు తీతలో తనకంటే వేగంగా పనులు తీస్తుందని చెప్తున్నారు...ఇక పంటలను నీళ్లు పెట్టడంలో మగాళ్లు కూడా చేయని విదంగా పని చేస్తొంది ఈ మునిరత్నమ్మ....

వందేళ్లకు దగ్గర్లో ఉన్న ఈవిడ ఇప్పటి వాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు...ఇక ఈమె మాట తీరు కూడా చాలా గట్టిగా ఉంది...ఇలా వ్యవసాయంగంలో ఔరా అనేలా పనులు చేస్తున్న ఈపెద్దమ్మకు ఎవరైనా  హ్యాట్సాప్ చెప్పాల్సిందే..