రష్యాతో పోరుకు సై అంటున్న 98 ఏండ్ల మహిళ

ఉక్రెయిన్ పై దాడులను రష్యా మరింత ఉధృతం చేసింది.నగరాలు,పట్టణాలు,ఆస్పత్రులు, స్కూళ్లను టార్గెట్ చేస్తూ బాంబులతో విరుచుకుపడుతోంది.విధ్యంసం చేస్తోంది. జనావాసాల‌పైనా కాల్పుల‌తో విరుచుకుప‌డుతుండ‌టంతో ప్రజలు భ‌యాందోళ‌న‌‌కు గుర‌వుతున్నారు. ర‌ష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు 98 ఏండ్ల ఉక్రెయిన్ మ‌హిళ ముందుకొచ్చింది. సైన్యంలో చేరేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రిచింది. రెండో ప్ర‌పంచ యుద్ధంలో చురుకుగా పాల్గొన్న ఒల్హా ట్వెర్డోఖ్లిబోవా ర‌ష్యాతో పోరుకు సై అంద‌ని ఉక్రెయిన్ విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.ఓలా తన మాతృభూమిని కాపాడుకునేందుకు సైన్యంలో చేరేందుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు. వ‌యోభారం కార‌ణంగా ఆమె విజ్ఞ‌ప్తిని తోసిపుచ్చారు.త్వర‌లోనే ఆమె కీవ్‌లో విజ‌యోత్స‌వ వేడుక‌లు చేసుకుంటార‌ని ఆశిస్తున్నామ‌ని పోస్ట్‌కు క్యాప్ష‌న్ జోడించారు. 

మరిన్ని వార్తల కోసం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

‘జూనియర్‌‌‌‌’కు జంటగా శ్రీలీల