మరో ఏడాదిలో నక్సల్స్ ను అంతం చేస్తామన్న కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోంది. నక్సల్స్ ఏరివేత దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఛత్తీస్ గడ్ పోలీసులు, కేంద్ర సంస్థల బలగాలు మావోలే టార్గెట్ గా దాడులు చేస్తున్నాయి. గత 13 నెలల్లో 300 మందికి పైగా మావోయిస్టులను హతమర్చాయి. 1,100 మందికి పైగా అరెస్టు చేశారు. దాదాపు 1000 మంది మావోలు లొంగిపోయారు.
ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. కొత్త ఆయుధాలు, నిఘా నెట్‌వర్క్‌లతో వారి సామర్థ్యాలను పెంచింది. దీని ఫలితంగా నక్సల్స్ ను హతమార్చడం లేదా పట్టుకోవడం జరుగుతోంది. లొంగిపోండి లేదా ఎదుర్కోండి అనే విధానంతో ముందుకెళ్తోంది ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం.
అరెస్టు అయిన నక్సల్స్ తిరిగి సాయుధ గ్రూపుల్లోకి వెళ్లకుండా నిరోధించడానికి అధికారులు చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నారు. లొంగిపోయిన నక్సల్స్‌ను పునరావాస కార్యక్రమాల ద్వారా సమాజంలో తిరిగి చేర్చుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధిపై దృష్టి పెట్టింది. రోడ్లు, టెలికం నెట్ వర్క్ లు, విద్య, హెల్త్ వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. యువతకు ఉద్యోగాల కోసం స్కిల్ డెవ్ లప్ మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
2026 మార్చి 31 వరక దేశంలో నక్సలిజాన్ని పెకిలించేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే.