తెలంగాణలో .. పది పరీక్షలకు 99.30 మంది హాజరు

తెలంగాణలో .. పది పరీక్షలకు 99.30 మంది హాజరు

వెలుగు, సిటీ నెట్ వర్క్: గ్రేటర్ పరిధిలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల పరిధిలో మొత్తం 1,86,594 మంది ఎగ్జామ్స్​రాయాల్సి ఉండగా, మొదటిరోజు తెలుగు ఎగ్జామ్ కు 1,85,297(99.30శాతం)మంది హాజరయ్యారు. 1,296 మంది హాజరు కాలేదు. ఉదయం 8.30 గంటల లోపే దాదాపు విద్యార్థులంతా ఎగ్జామ్స్ సెంటర్లకు చేరుకున్నారు. 

9.30 గంటలకు ఎగ్జామ్​ప్రారంభం కాగా, ఐదు నిమిషాలు లేటుగా వచ్చిన వారిని కూడా లోనికి అనుమతించారు. ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు కొనసాగనున్నాయి. విజయనగర్​కాలనీలోని సెంటెన్స్​స్కూల్​ఎగ్జామ్​సెంటర్​ను హైదరాబాద్​కలెక్టర్​అనుదీప్ తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ సరళిని పరిశీలించారు. రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌ గవర్నమెంట్​స్కూల్​లోని సెంటర్​ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సి.నారాయణరెడ్డి పరిశీలించారు.