
కోల్‌బెల్ట్, వెలుగు: రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన తొమ్మిదో తరగతి స్టూడెంట్సాయి లాస్విక్ఎలక్ట్రిక్ బైక్ తయారు చేశాడు. బైక్ తయారు చేసిన విధానాన్ని శనివారం స్థానిక విలేకరులకు వివరించాడు. తనకు చిన్నప్పటి నుంచి ఎలక్ట్రికల్ పరికరాల పట్ల ఎంతో ఆసక్తి ఉందన్నారు. పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు, పర్యావరణ కాలుష్యం నేపథ్యంలో ఎలక్ట్రికల్ బైక్ తయారు చేసేందుకు 48 వోల్టేజ్ బీఎల్ డీసీ మోటార్, నాలుగు లెడ్ యాసిడ్ బ్యాటరీలు వాడినట్లు చెప్పాడు.
ఒకసారి చార్జింగ్ పూర్తికావడానికి 4 గంటల సమయం పడుతుందని, 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో 80 కి.మీ దూరం ప్రయాణిస్తుందన్నాడు. బైక్ తయారీలో మెకానిక్‌లు సాయి, ముస్తాఫా, తన తండ్రి కృష్ణమూర్తి, ఫ్యామిలీ ఫ్రెండ్ శ్రీధర్‌రెడ్డి ఎంతో సహయం చేశారని చెప్పాడు. భవిష్యత్తులో సోలార్‌తో నడిచే కారును తయారు చేయాలని కోరిక ఉందన్నాడు.