ఓటేసిన 108 ఏండ్ల వృద్ధురాలు

గ్రేటర్​ వరంగల్, వెలుగు :  కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా కల్పించిన హోం ఓటింగ్​ను శుక్రవారం గ్రేటర్​ వరంగల్ పరిధిలోని బృందావన కాలనీకి చెందిన 108 ఏండ్ల సమ్మక్క అనే వృద్ధురాలు వినియోగించుకున్నారు. కొత్తవాడలో కూడా మరో వృద్ధురాలు, దివ్యాంగుడు ఓటు వేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ఆఫీసర్లు మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టిన హోం ఓటింగ్​లో పలువురు వృద్ధులు తమ ఇంట్లోనే ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిబంధనల మేరకు ఎన్నికల ఆఫీసర్లు, పోలీసులు పాల్గొన్నారు.